10 Months తర్వాత జైలు నుంచి బయటకు సిద్దు.. 2 నెలల ముందుగానే విడుదల
పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ ఈ రోజు పాటియాలా జైలు నుంచి విడుదల కానున్నారు. రోడ్డు పక్కన ఓ వ్యక్తితో గొడవ జరగగా.. సదరు వ్యక్తి చనిపోయిన కేసులో సిద్దుకు ఏడాది శిక్ష పడింది. జైలులో సత్ప్రవర్తన వల్లరెండు నెలల ముందుగానే విడుదల అవుతున్నారు.
Navjot Sidhu:పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ (Navjot Sidhu) ఈ రోజు పాటియాలా జైలు (patiala jail) నుంచి విడుదల కానున్నారు. రోడ్డు పక్కన ఓ వ్యక్తితో గొడవ జరగగా.. సదరు వ్యక్తి చనిపోయిన కేసులో సిద్దుకు (siddu) ఏడాది శిక్ష పడింది. ఈ ఘటన 34 ఏళ్ల క్రితం జరిగిన సంగతి తెలిసిందే. జైలులో సత్ప్రవర్తన వల్ల సిద్దు రెండు నెలల ముందుగానే విడుదల అవుతున్నారు. జైలు నుంచి విడుదల అవుతున్నానని.. మధ్యాహ్నం జైలు బయట మీడియాతో మాట్లాడతానని ఈ రోజు ఉదయం సిద్దు (siddu) ట్వీట్ చేశారు.
స్టేట్ జనరల్ రిమిషన్ పాలసీ మేరకు సిద్దు జైలు నుంచి విడుదల అవుతున్నారని ఆయన తరపు న్యాయవాది హెచ్పీఎస్ వర్మ (verma) మీడియాకు తెలిపారు. నిజానికి ఈ ఏడాది మే నెలలో ఆయన విడుదల కావాల్సి ఉంది. కానీ జైలులో మంచి ప్రవర్తన వల్ల రిలీజ్ (release) చేస్తున్నారు. మంచి ప్రవర్తన కలిగిన వారికి ఆది, సెలవు దినాలు తీసివేస్తారు. అలా 48 రోజులు తీయడంతో ముందుగానే బయటకు వస్తున్నారు.
పాటియాలాకు చెందిన గుర్నామ్ సింగ్ (gurnam singh) అనే వృద్దుడు (65)తో సిద్దుకు 1988 డిసెంబర్ 27వ తేదీన పార్కింగ్ (parking) విషయమై వాగ్వివాదం జరిగింది. సిద్దు, అతని స్నేహితుడు రూపిందర్ సింగ్ సందు వృద్దుడిని కారు నుంచి లాగి దాడి చేశారు. ఆ వృద్దుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. వృద్దుడిపై సిద్దూ (siddu) దాడి చేసినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు కోర్టుకు తెలిపారు. తలపై కొట్టడంతోనే గుర్నామ్ సింగ్ చనిపోయారని పేర్కొన్నారు.
అకారణంగా దాడి చేసినందుకు సుప్రీంకోర్టు 2018లో సిద్దుకు రూ.వెయ్యి రూపాయల జరిమానా విధించింది. ఆ తర్వాత ఉత్తర్వును సమీక్షించింది. సిద్దూకు జైలు శిక్ష విధించడం సముచితంగా భావించింది. ఒక వ్యక్తి చనిపోతే తీవ్రమైన నేరంగా పరిగణిచింది. గత ఏడాది ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. ఇప్పుడు సత్ప్రవర్తన వల్ల ఆయన జైలు నుంచి బయటకు వస్తున్నారు. మధ్యాహ్నాం మీడియాతో సిద్దు (Navjot Sidhu) ఏం మాట్లాడతారోననే హైప్ నెలకొంది.