PPM: జిల్లాలోని పలు హోటళ్లలో అక్రమంగా వినియోగిస్తున్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లపై పౌరసరఫరాల శాఖ అధికారులు మంగళవారం ఆకస్మిక మెరుపు దాడులు నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ సీ. యశ్వంత్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు దాడులు నిర్వహించగా, మొత్తం 24 గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ తనిఖీల్లో ఏఎస్వో, డీ.టీ, తదితరులు పాల్గొన్నారు.