మనోజ్ వ్యక్తిగత జీవితంలో చాలా ఎదురుదెబ్బ తిన్నాడు. మొదటి భార్య ప్రణతి (Pranathi)తో విడాకుల అనంతరం పూర్తి నైరాష్యంలోకి వెళ్లాడు. ఆ సమయంలో మౌనిక మనోజ్ కు కొండంత అండగా నిలబడింది. అనంతరం వీరిద్దరూ తమ ప్రేమను పెళ్లిగా మార్చుకున్నారు. ఈ క్రమంలో వీరి పెళ్లికి చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. కానీ మనోజ్ అక్క లక్ష్మీ ప్రసన్న వీరికి అండగా నిలబడింది.
ఇన్నాళ్ల తమ ప్రేమబంధాన్ని పెళ్లితో ఒక్కటి చేసుకున్న మంచు మనోజ్ (Manchu Manoj)-భూమా మౌనిక రెడ్డి (Bhuma Mounika Reddy) జంట తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. మార్చి 3న పెళ్లయినప్పటి ఫుల్ బిజీలో ఉన్న ఈ దంపతులు ఆదివారం కర్నూలుకు వెళ్లారు. దివంగత భూమ నాగిరెడ్డి, శోభ సమాధిలను సందర్శించి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి తిరుమల (Tirumala)కు వచ్చారు. దర్శనానంతరం మీడియాతో మనోజ్ మాట్లాడాడు. దేవుడి దయతో.. ప్రజలందరి దీవెనతో తమ పెళ్లి (Marriage) జరిగింది అని తెలిపాడు.
తిరుమల ఆలయం వెలుపల మనోజ్ మాట్లాడుతూ.. ‘‘నాకు చాలా ఆనందంగా ఉంది. జీవితంలో ఏదైనా ఓడిపోవచ్చు కానీ ప్రేమ (Love) ఓడిపోవద్దు. ఎప్పటికీ ప్రేమే గెలవాలి అని గట్టిగా నమ్ముతున్నా. అందుకే ఈరోజు మా ప్రేమ గెలిచింది. మా అక్క లక్ష్మీ ప్రసన్న (Manchu Lakshmi Prasanna) ఆశీస్సులు ఉన్నంతవరకు మమ్మల్ని ఏం చేయలేదు. మమ్మల్ని దీవించిన వారందరికీ ధన్యవాదాలు’ అని తెలిపాడు. తదుపరి ఏంటి అని మీడియా ప్రశ్నించగా.. ‘ఇక వరుసగా సినిమాలు చేస్తాను. ఎక్కడ ఆగానో అక్కడి నుంచి మొదలుపెడుతున్నా. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది’ అని తెలిపాడు. ఇక రాజకీయాల విషయం ప్రశ్నించగా ‘నాకు రాజకీయా (Politics)ల్లోకి ఎప్పుడూ రావాలని లేదు. కానీ ప్రజలకు సేవ (Service) చేయాలని మాత్రం ఉంది. ఇదే ఆలోచన మా ఇద్దరి (మౌనిక)వి కలిశాయి. మౌనిక రాజకీయాల్లోకి వెళ్తానంటే పూర్తి మద్దతు ఇస్తా’ అని మనోజ్ తన అభిప్రాయం తెలిపాడు.
మౌనికతో తన పరిచయం.. పెళ్లి వరకు వచ్చిన పరిణామాలను ఒకసారి గుర్తు చేసుకున్నాడు. మౌనికతో తన బంధం విషయమై మాట్లాడుతూ..‘12 సంవత్సరాల నుంచి మౌనిక నాకు తెలుసు. నాలుగు సంవత్సరాలుగా ఒక లోకంలో ఉన్నా. అక్కడి నుంచి మౌనిక నన్ను తిరిగి తీసుకువచ్చింది. నాలుగు సంవత్సరాలు మేం కష్టపడ్డాం. చాలా వ్యతిరేకత వచ్చింది. చాలా కష్టపడ్డాం. మా జీవితం గురించి ఆలోచించాం. చివరకు దేవుడి దయతో పెళ్లి చేసుకున్నాం’ అని మనోజ్ తెలిపాడు. కాగా మనోజ్ వెంట అతడి సోదరి లక్ష్మీ ప్రసన్న, తెలంగాణ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి (Rohith Reddy) తదితరులు ఉన్నారు.
వ్యక్తిగత జీవితం చక్కబడడంతో మనోజ్ ఇక సినిమాలపై పూర్తి దృష్టి సారించనున్నాడు. ఇప్పటికే వాట్ ది ఫిష్ (What The Fish) అనే సినిమా ప్రకటించాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలో జరుగనుంది. కాగా మనోజ్ వ్యక్తిగత జీవితంలో చాలా ఎదురుదెబ్బ తిన్నాడు. మొదటి భార్య ప్రణతి (Pranathi)తో విడాకుల అనంతరం పూర్తి నైరాష్యంలోకి వెళ్లాడు. ఆ సమయంలో మౌనిక మనోజ్ కు కొండంత అండగా నిలబడింది. అనంతరం వీరిద్దరూ తమ ప్రేమను పెళ్లిగా మార్చుకున్నారు. ఈ క్రమంలో వీరి పెళ్లికి చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. కానీ మనోజ్ అక్క లక్ష్మీ ప్రసన్న వీరికి అండగా నిలబడింది. ఎవరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వీరి పెళ్లిని దగ్గరుండి చేయించింది. అయితే వీరి పెళ్లిని వ్యతిరేకించింది ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. తిరుమలలో మనోజ్ ‘వ్యతిరేకత వచ్చింది’, ‘కష్టపడ్డాం’ అనే వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.