గోవాలో జరిగిన అగ్నిప్రమాదంలో 25 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో నైట్‌క్లబ్‌కు చెందిన నలుగురు సిబ్బందిని అరెస్ట్ చేసినట్లు గోవా సీఎం ప్రమోద్ సావంత్ వెల్లడించారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ క్లబ్‌ను నిర్వహించేందుకు అనుమతించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలక్ట్రిక్ బాణసంచా పేల్చడం వల్ల మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని వివరించారు.