WGL: కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు టిఫిన్, భోజనం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ఉప్మాలో పురుగులు కనిపించడంతో.. మెస్ సిబ్బందిని ప్రశ్నించగా, పురుగులు ఎక్కడి నుంచి వచ్చాయో తమకు తెలియదని సమాధానమిచ్చారు. ఈ సంఘటనపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.