మహారాష్ట్రలోని నాసిక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లోయలో కారు పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. సప్తశృంగి మాత దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాలను లోయలోనుంచి బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు.