SDPT: దుబ్బాక పట్టణంలోని బాలాజీ దేవాలయంలో రామకోటి సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీరామరక్ష స్తోత్ర పుస్తకాలను గజ్వేల్‌కు చెందిన భక్తి రత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు పంపిణీ చేశారు. లోక కళ్యాణార్థం శ్రీ రామ రక్షా స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయాలన్నారు. శాశ్వతమైన రామనామం ప్రతి ఒక్కరూ లిఖించి ధరించాలన్నారు. ఇందులో ఆలయ కమిటీ నిర్వాహకులు ఉన్నారు.