ASF: 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 11వ తేదీన తొలి విడత సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరగనున్న ఎన్నికలకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని ASF కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి తొలి విడత పోలింగ్ నిర్వహించే 5 మండలాల అధికారులు, మండల పంచాయతీ అధికారులు, జోనల్ అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్ష నిర్వహించారు.