కోనసీమ: ఎస్టీయూ జిల్లా శాఖ అధ్యక్షులుగా పోతంశెట్టి వెంకట రామారావు నియమితులయ్యారు. అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో ఆదివారం జరిగిన ఎస్టీయూ వార్షిక సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొన్నారు. ప్రధాన కార్యదర్శిగా కారుమూరి కళ్యాణ బాబు, ఆర్థిక కార్యదర్శిగా కుడిపూడి హేమంత్, ఉపాధ్యాయ వాని కన్వీనర్‌గా చిక్కం మైనర్ బాబు నియమితులయ్యారు.