»Ugadi Utsav Starts From Feb 19 In Srisailam Temple
Ugadi Festival 19 నుంచి శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు.. ఆ సేవలు బంద్
ఈ ఉత్సవాలకు తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షలు ముగుస్తుండడంతో కుటుంబసమేతంగా మల్లికార్జునుడి దర్శనానికి రానున్నారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు పాలక మండలి ఆదేశాలు ఇచ్చింది.
జ్యోతిర్లింగాల (Jyotirlinga)లో ఒకటైన.. నల్లమల్ల (Nallamalla) అటవీ ప్రాంతంలో కొలువైన.. తెలంగాణ (Telangana)కు చేరువలో ఉన్న ఏపీలోని శ్రీశైలం (SriSailam)లో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఉగాది పండుగ (Ugadi Festival) సందర్భంగా ఈనెల 19 నుంచి ఉత్సవాలు (Utsav) నిర్వహించనున్నారు. తెలుగు నూతన సంవత్సరాది కావడంతో ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా మహోత్సవాలు జరుపనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు చకాచకా కొనసాగుతున్నాయి. ఉత్సవాల నేపథ్యంలో రోజువారీగా జరిగే కొన్ని సేవలను రద్దు చేశారు. ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.
19వ తేదీ నుంచి 23 వరకు ఐదు రోజుల పాటు భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం (Srisailam Sri Bhramaramba Mallikarjuna Swamy Ammavarula Devasthanam)లో ఉత్సవాలు నిర్వహించాలని శ్రీశైలం ఆలయ పాలక మండలి నిర్ణయించింది. ఆలయ పరిపాలన భవనంలో ఉత్సవాల నిర్వహణపై చర్చించారు. ఏర్పాట్లపై అన్ని అధికారులతో సమాలోచనలు చేశారు. సమన్వయంతో ఉత్సవాలను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జరగాలని ఆలయ పాలక మండలి నిర్ణయించింది. ఉత్సవాలు జరిగే ఐదు రోజుల పాటు స్పర్శ దర్శనం నిలిపివేస్తున్నట్లు ఈవో లవన్న ప్రకటించారు.
భక్తులందరి స్వామివారి అలంకార దర్శనం యథావిధిగా కల్పించనున్నారు. ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయనున్నారు. విశేష సేవలు, అర్చనలు జరుగనున్నాయి. అమ్మవారి యాగశాల ప్రవేశంతో ఉగాది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమాలు జరుగనున్నాయి. ఉత్సవాలలో ప్రధాన ఘట్టం రథోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. కాగా ఈ ఉత్సవాలకు తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షలు ముగుస్తుండడంతో కుటుంబసమేతంగా మల్లికార్జునుడి దర్శనానికి రానున్నారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు పాలక మండలి ఆదేశాలు ఇచ్చింది. ఆలయం దేదీప్యమానంగా అలకరించడం, విద్యుద్దీపకరణ, గదులు, దర్శన ఏర్పాట్లు వంటి వాటిపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా ప్రసాదాల కొరత రాకుండా చూడాలని స్పష్టం చేశారు. ఇక ఎండలు తీవ్రమవుతుండడంతో భక్తులు ఇబ్బందులు పడకుండా చలువ పందిళ్లు.. టెంట్ల వంటి సౌకర్యాలు, తాగునీరు కల్పించనున్నారు.