»Minister Talasani Srinivas Yadav Praised On Telangana Cm Kcr
Telangana సీఎం కేసీఆర్ ఎవరో కాదు కొమురవెల్లి మల్లన్న: మంత్రి తలసాని
బోయినపల్లి వినోద్ కుమార్ (B Vinod Kumar)లాంటి నాయకుడిని గెలిపించుకుని అభివృద్ధికి బాటలు వేసుకోవాలి. కరీంనగర్ (Karimnagar)లో అత్యధిక నిధులు తీసుకువచ్చి వినోద్ కుమార్ అభివృద్ధి చేశారు. వినోద్ కుమార్ గొప్ప నాయకుడు. అలాంటి వారికి ప్రాధాన్యం ఇస్తే ఎప్పుడూ ప్రజాక్షేత్రంలోనే ఉండి సేవ చేస్తారు’’ అని మంత్రి తలసాని పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (K. Chandrashekar Rao)పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) ప్రశంసల వర్షం కురిపించాడు. సాక్షాత్తూ కొమురవెల్లి మల్లన్న (Komuravelly Mallikarjuna Swamy) స్వరూపమే సీఎం కేసీఆర్ అని కొనియాడాడు. మల్లన్న ప్రతిరూపంగా సీఎం యాదవుల (Yadav’s)కు సేవలు అందిస్తున్నారని పేర్కొన్నాడు. సిద్దిపేట జిల్లా (Siddipet District) గజ్వేల్ (Gajwel) మండలం రిమ్మనగూడలో ఆదివారం యాదవుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కరీంనగర్ లోక్ సభ (Karimnagar Lok Sabha Constituency)) నియోజకవర్గ పరిధిలోని యాదవులు తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించాడు.
‘‘సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా మారింది. ఎక్కడ చూసినా పాడిపంటలతో తెలంగాణ (Telangana) మాగాణిగా మారింది. గత ప్రభుత్వాల హయాంలో యాదవులు వివక్షకు గురయ్యారు. కానీ సీఎం కేసీఆర్ ఎప్పుడూ లేని విధంగా రూ.11 వేల కోట్లతో యాదవులకు గొర్రెలు అందించారు. యాదవుల ఆరాధ్య దైవం కొమురవెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేశారు. ఒకప్పుడు హైదరాబాద్ కే పరిమితమైన సందర్ పండుగను ఇప్పుడు రాష్ట్ర పండుగగా చేసుకుంటున్నాం. మాయమాటలు చెప్పే వారికి కాకుండా చేతల ప్రభుత్వానికి ప్రజలు మద్దతు తెలపాలి’’ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపాడు.
‘‘కరీంనగర్ లో అవగాహన లేని వ్యక్తి (బండి సంజయ్ కుమార్) గెలవడంతో కరీంనగర్ అభివృద్ధి కుంటుపడింది. బోయినపల్లి వినోద్ కుమార్ (B Vinod Kumar)లాంటి నాయకుడిని గెలిపించుకుని అభివృద్ధికి బాటలు వేసుకోవాలి. కరీంనగర్ (Karimnagar)లో అత్యధిక నిధులు తీసుకువచ్చి వినోద్ కుమార్ అభివృద్ధి చేశారు. వినోద్ కుమార్ గొప్ప నాయకుడు. అలాంటి వారికి ప్రాధాన్యం ఇస్తే ఎప్పుడూ ప్రజాక్షేత్రంలోనే ఉండి సేవ చేస్తారు’’ అని మంత్రి తలసాని పేర్కొన్నారు. కాగా ఈ సమావేశానికి ముందు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయనపల్లి వినోద్ కుమార్, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తదితరులతో కలిసి మంత్రి తలసాని కొమురవెల్లి మల్లన్న ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఘట్ కేసర్ లో యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన కుల సంఘం భవనాన్ని వారు ప్రారంభించారు.