»Ka Paul Bumper Offer To Sanath Nagar Brs Mla Talasani Srinivas Yadav
KA Paul: మంత్రి తలసానికి కేఏ పాల్ అదిరిపోయే ఆఫర్
సనత్ నగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సరికొత్త ఆఫర్ ఇచ్చారు. బానిస బతుకు వద్దని, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గెల్వలేదన్నారు. ఈ క్రమంలో తన పార్టీలో చేరాలని కోరారు.
ka paul bumper offer to sanath nagar brs mla talasani srinivas yadav
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(talasani srinivas yadav) కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(ka paul) ఓ క్రేజీ ఆఫర్ ప్రకటించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కేసీఆర్ దగ్గర బానిస బతుకు వద్దని సూచించారు. ఈ క్రమంలో ప్రజాశాంతి పార్టీలో చేరాలని కోరారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ బీ టీంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ గెలిచి పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ అవినీతి అక్రమాలు ప్రజలకు ఇప్పటికే తెలిశాయని, బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి పోయిందని వ్యాఖ్యానించారు.
అయితే నేడు పలువురు బీఆర్ఎస్(BRS) మంత్రులపై కేఏ పాల్ ఈసీ(EC)కి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతలు దానం నాగేందర్, తాత మధు ఎన్నికల కమిషన్ కు వార్నింగ్ ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాదు నగరంలో దానం నాగేందర్ బీఆర్ఎస్ జెండా మోసే వాళ్లకు మాత్రమే డబూల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తున్నారని ఆరోపించారు. దీంతోపాటు పలు నిబంధనలు ఉల్లంగించారని ఫిర్యాదు చేశారు. ఇలాంటి క్రమంలో వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులను కోరారు. మరోవైపు తమ పార్టీలో చేరాలనుకునే ఆశావాహులు 10 వేల రూపాయలు కట్టి పార్టీ బీ ఫామ్ పొందవచ్చని కేఏ పాల్ స్పష్టం చేశారు. అంతేకాదు పోలీసులకు కూడా తమ పార్టీ అండగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల ప్రభావం ప్రజల్లో లేదని..వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తుందని పాల్ ధీమా వ్యక్తం చేశారు.