»Congress Govt Has Done Extreme Injustice Former Minister Niranjan Reddy
BRS Leaders : కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
BRS Leaders : మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దాదాపు మూడు నెలల విరామం తర్వాత తెలంగాణ భవన్కు వెళ్లారు. పార్టీ కార్యకర్తలు కేసీఆర్ ఘన స్వాగతం పలికారు.
BRS Leaders : మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దాదాపు మూడు నెలల విరామం తర్వాత తెలంగాణ భవన్కు వెళ్లారు. పార్టీ కార్యకర్తలు కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్కు ఆయన రావడంతో కేసీఆర్ను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. కృష్ణా జలాల అంశానికి సంబంధించిన కార్యాచరణపై కేసీఆర్.. బీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, ఉమ్మడి హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన పలువరు నేతలు పాల్గొన్నారు. కృష్ణా జలాల అంశంపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అనంతరం బీఆర్ఎస్ నేతలు పార్టీ కార్యలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో చర్చించిన అంశాలను తెలియజేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టారు. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ తక్షణం ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. ఇంటింటికి పోరాటాన్ని తీసుకెళ్తామని మాజీ మంత్రి పేర్కొన్నారు. ఉద్యమం కేవలం నల్గొండ సభతోనే ఆగదు. ఆరు నెలల్లో ట్రిబ్యునల్ తీర్పు వచ్చేటట్టు చర్యలు తీసుకోవాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. గత పదేళ్లుగా ప్రాజెక్టులను కాపాడుకుంటూ వచ్చినం. ఢిల్లీ మీటింగ్ కాంగ్రెస్ యథా పలంగా కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులను కలిపిందని నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ సమాయత్తం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందరినీ కలుపుకొని పోవాలన్నారు. అనాలోచిత నిర్ణయం వల్ల ప్రజలు ఆగమైపోతారు. కరెంట్ ఉత్పత్తి చేయాలన్నా.. తాగునీటి కోసం అయినా కేఆర్ఎంబీ అనుమతి తీసుకునే పరిస్థితి అన్నారు. రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాల్లో నీటి వాటా తేలే దాకా పోరాటం ఆగదు అన్నారు.