స్టేషన్లోనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Constable Suicide In Police Station : శంకర్ రెడ్డి అనే కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచారు. ఈ ఘటన శ్రీశైలం(SRISAILAM) వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. స్టేషన్లో పోలీసులు విశ్రాంతి తీసుకునే గదిలోనే ఆయన తుపాకీతో షూట్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఎందువల్ల ఆయన ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డారు? అనే విషయమై సమాచారం తెలియరాలేదు.
ఈ విషయమై పోలీసు అధికారులను ప్రశ్నించినా ఎవరూ వివరాలను వెల్లడించలేదు. సమాచారం తెలిసిన తర్వాత సీఐ ప్రసాదరావు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు తమ స్టేషన్‌కు చేరుకున్న తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని స్థానిక పోలీసులు తెలిపారు.
కానిస్టేబుల్(CONISTABLE) శంకర్ రెడ్డి 2001లో సివిల్ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరారు. కర్నూలు, పెద్దకడబూరు, శ్రీశైలం స్టేషన్లలో విధులు నిర్వహించారు. చివరికి శ్రీశైలం పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్య(SUICIDE) చేసుకుని ప్రాణాలు విడవడంపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.