చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో RCB తమ మ్యాచ్లను పుణేకు తరలించాలని ప్రయత్నిస్తోంది. దీనిపై కర్ణాటక Dy.CM డీకే శివకుమార్ స్పందించారు. RCB మ్యాచ్లను చిన్నస్వామి నుంచి తరలించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. ఇది తమ గౌరవానికి సంబంధించిన అంశమని అన్నారు. తొక్కిసలాట ఘటనలు పునరావృతం కాకుండా భారీ భద్రత కల్పిస్తామని చెప్పారు.