»Mahabubnagar To Visakhapatnam Train Starts May 20th 2023 Onwards
Mahabubnagar to Visakhapatnam: మహబూబ్‌నగర్ టూ విశాఖపట్నం ఎక్స్ ప్రెస్.. !
విశాఖపట్నం-కాచిగూడ(Mahabubnagar to Visakhapatnam) ఎక్స్‌ప్రెస్ రైళ్లను మహబూబ్‌నగర్ స్టేషన్ వరకు పొడిగిస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే (ఈసీఓఆర్) ప్రకటించింది. 12861 విశాఖపట్నం-కాచిగూడ ఎక్స్‌ప్రెస్ మే 20 నుంచి మహబూబ్‌నగర్ వరకు పొడిగించబడుతుందని తెలిపింది. ఇది విశాఖపట్నం నుంచి సాయంత్రం 6.40 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 6:45 గంటలకు కాచిగూడ చేరుకుని 6.55 గంటలకు బయలుదేరి 9.20 గంటలకు మహబూబ్ నగర్ చేరుకుంటారు.
మహబూబ్ నగర్ నుంచి విశాఖపట్నానికి(Mahabubnagar to Visakhapatnam) స్పెషల్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి పట్టాలు ఎక్కనుంది. ఈ ఎక్స్ ప్రెస్ ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(kishan reddy) ప్రారంభించనున్నారు. కాచిగూడ- విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును మహబూబ్ నగర్ వరకు పొడిగిస్తూ రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
రైలు నం.12861/12862 విశాఖపట్నం టూ కాచిగూడ -టూ విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ను మహబూబ్‌నగర్ వరకు నడిపేందుకు పొడిగించామని దక్షిణమధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. మహబూబ్ నగర్‌ను కోస్తా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంతో నేరుగా అనుసంధానించే మొదటి రైలు ఇది అని అధికారులు తెలిపారు. నేడు మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్ నుంచి ఈ రైలును జెండా ఊపి కిషన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. గతంలో మహబూబ్‌నగర్ నుంచి కోస్తా ఆంధ్రాకు నేరుగా కనెక్టివిటీ లేదు.
ఈ సమస్యను తీర్చడానికి రైల్వే మంత్రిత్వ శాఖ రైలు నం.12861/12862 విశాఖపట్నం -టూ కాచిగూడ -టూ విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ను మహబూబ్‌నగర్ వరకు పొడిగించేందుకు ఆమోదించింది. పొడిగించిన ఈ రైలు ద్వారా నేరుగా మహబూబ్ నగర్ నుంచి ఆంధ్ర ప్రదేశ్‌లోని రాయనపాడు (విజయవాడ), ఏలూరు, రాజమండ్రి, అన్నవరం, విశాఖపట్నం మొదలైన ప్రధాన నగరాలకు ప్రయాణించేందుకు వీలుకలుగుతుంది.
ఈ రైలు జడ్చర్ల, షాద్‌నగర్, ఉందానగర్ రైల్వే స్టేషన్లలో స్టాప్‌లను కల్పించారు. ఈ రైలుకు ఎల్‌హెచ్ బి కోచ్‌లను జతచేశారు. ఇవి ఆధునిక సౌకర్యాలతో సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.