»Love Couple Committed To Suicide In Narsingi Lake
Lover’s Day రోజు పరారైన ప్రేమజంట కథ విషాదం.. చెరువులో విగతజీవులుగా
కలిసి ఉండలేకపోతున్నాం.. కనీసం చావులో నైనా కలిసి పోదామని నిర్ణయించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఇంకా నిండా 25 ఏళ్లు కూడా నిండని వాళ్లు ఆత్మహత్యకు పాల్పడడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ప్రేమ కోసం ఆత్మహత్యకు పాల్పడడం అందరినీ కలచివేసింది. ఎంతో మంచి భవిష్యత్ ను వారిద్దరూ కోల్పోయారు.
వారిద్దరికి పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమ (Love)గా మారింది. ఇద్దరు ఒకరినొకరు విడిచి ఉండలేకపోయారు. కానీ అన్ని ప్రేమ కథలు (Love Stories) పెళ్లి దాకా చేరవు కదా. వీరి విషయంలో అలాంటిదే జరిగింది. వీరి ప్రేమకు మతం అడ్డు వచ్చింది. ఇద్దరివి వేర్వేరు మతాలు (Religion) కావడంతో యువతి తల్లిదండ్రులు వీరి పెళ్లికి నిరాకరించారు. కొన్నాళ్లకు ఆమెకు తమకు నచ్చిన వ్యక్తితో వివాహం చేశారు. పెళ్లయినప్పటి నుంచి ఆమె మనోవేదనతో ఉండిపోయింది. తన ప్రియుడితో కలిసి బతకలేకపోతుండడంతో ఆవేదనకు గురయ్యింది. వారం కిందట పుట్టింటికి వచ్చింది. తన ప్రియుడికి సమాచారం ఇచ్చింది. ఇద్దరు కలిసి ప్రేమికుల రోజు (Lover’s Day) ఫిబ్రవరి 14వ తేదీన పారిపోయారు. చివరకు వాళ్లిదరూ చెరువులో దూకి ఆత్మహత్య (Suicide)కు పాల్పడ్డారు. ఈ విషాద సంఘటన మెదక్ జిల్లా (Medak District) నార్సింగి (Narsingi)లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..
మెదక్ జిల్లా నార్సింగి ప్రాంతానికి చెందిన కల్పన అదే ప్రాంతానికి చెందిన ఖలీల్ తో పరిచయమైంది. ఆ తర్వాత వారి మధ్య ప్రేమ చిగురించింది. కొన్నాళ్లు ప్రేమించుకున్నారు. వివాహం చేసుకుందామనుకుంటే వారి మతం అడ్డు వచ్చింది. వేర్వేరు మతాలు కావడంతో వీరి పెళ్లికి కుటుంబసభ్యులు నిరాకరించారు. ఇలా అయితే బాగుండదని యువతి తల్లిదండ్రులు భావించారు. రెండు నెలల కిందట ఓ యువకుడికి ఇచ్చి కల్పన వివాహం (Marriage) చేశారు. పెళ్లయి అత్తారింటికి వెళ్లింది. అయినా కూడా కల్పనకు ఖలీలే గుర్తుకు వస్తున్నాడు. ఖలీల్ ను మరచిపోలేదు. అతడే కావాలని రోజు బాధపడుతుండేది. ఈ క్రమంలో నాలుగు రోజుల కిందట పుట్టింటికి వచ్చింది. కలిసి బతకలేమని భావించిన కల్పన, ఖలీల్ ఇద్దరూ కలిసి ఫిబ్రవరి 14వ తేదీన ఇంట్లో నుంచి పారిపోయారు.
బయటకు వెళ్లిన వారిద్దరూ ఎంతకీ తిరిగి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే నార్సింగి చెరువు వద్ద గ్రామస్తులకు వీరి చెప్పులు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పరిశీలించారు. చెరువులో రెండు రోజులుగా జాలర్లతో గాలించగా వీరి మృతదేహాలు గురువారం లభించాయి. ప్రేమికుల రోజే వారు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తున్నది. కాగా కల్పనకు పెళ్లి ఇష్టం లేదు. ఖలీల్ పైనే ప్రేమ ఉన్న ఆమె పెళ్లయిన తర్వాత కూడా భర్తతో ఉండకుండా పుట్టింటికి వచ్చేసింది. పెళ్లయిన తర్వాత కూడా ఖలీల్ తో రామాయంపేటలో కల్పన తిరుగుతూ కనిపించింది. పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలించగా ఖలీల్ తో బైక్ పై కలిసి తిరుగుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. కలిసి ఉండలేకపోతున్నాం.. కనీసం చావులో నైనా కలిసి పోదామని నిర్ణయించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఇంకా నిండా 25 ఏళ్లు కూడా నిండని వాళ్లు ఆత్మహత్యకు పాల్పడడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ప్రేమ కోసం ఆత్మహత్యకు పాల్పడడం అందరినీ కలచివేసింది. ఎంతో మంచి భవిష్యత్ ను వారిద్దరూ కోల్పోయారు.