Valentine’s Day Google Doodle : ఆసక్తికరంగా వాలంటైన్స్‌డే గూగుల్ డూడుల్
సందర్భానుసారంగా గూగుల్ డూడుల్స్‌ని తయారు చేసి పెడుతుంటుంది. ప్రతి ప్రత్యేకమైన రోజుకు సంబంధించిన డూడుల్‌ని గూగుల్ సెర్చ్ పేజ్‌లో మనం చూస్తూ ఉంటాం. ఈ వాలెంటైన్స్ డే డూడుల్‌ని గూగుల్ చాలా క్రియేటివ్‌గా తీసుకొచ్చింది.
Valentine’s Day special Google Doodle : ప్రేమికులకు పండుగ వాతావరణంలా ఉండే రోజు వాలంటైన్స్‌డే. అందుకనే ఈ రోజును గూగుల్(Google) కూడా తనదైన ప్రత్యేక శైలిలో జరిపేందుకు ప్రయత్నించింది. ఈ రోజును పురస్కరించుకుని ప్రత్యేక డూడుల్‌ని సెర్చ్ పేజ్‌లో యాడ్ చేసి అందరికీ సరదాలను పంచుతోంది.
ఈ డూడుల్‌ని క్లిక్చేయగానే డూడుల్ ఓ ప్రత్యేకమైన క్విజ్ గేమ్‌లోకి మనల్ని తీసుకు వెళుతోంది. Chemistry CuPd పేరుతో ఆ పేజ్ ఓపెన్ అవుతోంది. మన వ్యక్తిత్వానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలను అడుగుతూ ముందుకు తీసుకు వెళుతోంది. తర్వాత మనం ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న వారం? మనకు సంబంధించిన వాయువు లేదా పరమాణువుల పేరు ఏమిటి లాంటి వాటిని వివరిస్తోంది. సరదాగా దీన్ని ఆడి ఎవరైనా ఎంజాయ్ చేయవచ్చు.
ప్రేమికుల రోజు అంటే ముఖ్యంగా యువతకు పండుగలా ఉంటుంది. విషెస్, బహుమతులు, పార్టీలు, ప్రపోజల్స్ అంటూ రకరకాలుగా ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు. అయితే వర్క్ లైఫ్‌లో ఉన్న వారు మాత్రం బిజీ బిజీగా తమ రోజును ఆఫీసు పనుల కోసం కేటాయిస్తుంటారు. అలా కంప్యూటర్ల ముందు కూర్చునే వారంతా చక్కగా గూగుల్ డూడుల్‌ని ఆడి ఈ ప్రత్యేకమైన రోజును ఆస్వాదించేయొచ్చు.