»Karnataka Congress Working President R Dhruvanarayana Dies At 61
Congress Partyలో తీరని విషాదం.. పార్టీ సీనియర్ నాయకుడు హఠాన్మరణం
అన్ని ఏర్పాట్లు చేసుకుంటుండగా గుండెపోటుకు గురై మృతి చెందడంతో పార్టీ నాయకులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన మృతితో పార్టీకి తీరని నష్టం చేకూరింది. ఆయన ప్రభావం దాదాపు ఐదు నియోజకవర్గాల్లో ఉండేది. ఫలితంగా ఆయన లోటు భర్తీ చేయలేనిదని స్థానిక కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
త్వరలో ఎన్నికలు జరుగనున్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ (Indian National Congress Party-INC) కి తీరని నష్టం ఏర్పడింది. పార్టీలో సీనియర్ నాయకుడు, పార్టీ కేపీసీసీ (KPCC) వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఆర్. ధ్రువనారాయణ (61) (R Dhruvanarayana) ఆకస్మిక మరణం పొందారు. తెల్లవారుజామున గుండెపోటు (Chest Pain)కు గురైన ఆయనను కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందాడని వైద్యులు (Doctors) ధ్రువీకరించారు. అతడి మరణంతో కర్ణాటకలో విషాదం అలుముకుంది.
ధ్రువనారాయణ మృతి చెందారు. ఛాతీ నొప్పితో బాధపడుతుండడంతో అతడి డ్రైవర్ ఉదయం 6.40 గంటలకు తీసుకొచ్చారు. కానీ అప్పటికే ఆయన మరణించారు’ అని వైద్యుడు డాక్టర్ మంజునాథ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దిగ్భ్రాంతి చెందింది. అతడి మృతికి పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi)తో పాటు జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah), పార్టీ సీనియర్ నాయకులు కె.శివ కుమార్ (DK Shivakumar) ఇతర ముఖ్య నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
1961 జూలై 31న హగ్గవాడిలో జన్మించిన ధ్రువనారాయణ బెంగళూరు (Bengaluru)లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం (Agriculture University) నుంచి మాస్టర్స్ డిగ్రీ చేశారు. 1983లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ తరఫున చామరాజనగర్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు (2009, 14) ఎంపీగా ధ్రువనారాయణ గెలిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 2004లో సంతెమరహళ్లి (Santhemarahalli) నియోజకవర్గం నుంచి ఒక్క ఓటుతో గెలుపొంది ధ్రువనారాయణ సంచలనం రేపారు. 2008లో కొల్లెగల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
త్వరలో ఎన్నికలు జరుగుతుండడంతో నంజన్ గూడు (Nanjangud) నుంచి పోటీ చేయాలని భావిస్తున్నాడు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటుండగా గుండెపోటుకు గురై మృతి చెందడంతో పార్టీ నాయకులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన మృతితో పార్టీకి తీరని నష్టం చేకూరింది. ఆయన ప్రభావం దాదాపు ఐదు నియోజకవర్గాల్లో ఉండేది. ఫలితంగా ఆయన లోటు భర్తీ చేయలేనిదని స్థానిక కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. కాగా ఆయన ఇటీవల రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నాడు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇలా జరిగిపోయింది.