తెలంగాణ యాసలో మాట్లాడుతూ వైరల్ గా మారడంతో బిగ్ బాస్ షోలో ఆమెకు అవకాశం వచ్చింది. అనంతరం జబర్దస్త్ షోలోకి పిలుపు రావడంతో అక్కడికి వెళ్లింది. ఇక జబర్దస్త్ ప్రారంభమైనప్పటి నుంచి రాకేశ్ ఉన్నాడు.
మరో ప్రేమ జంట పెళ్లి చేసుకుంది. షోలో జరిగిన పరిచయం కాస్త వారి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి దాకా అడుగులు పడ్డాయి. జబర్దస్త్ షో (Jabardasth Show) జంట జోర్దార్ సుజాత (Jordar Sujatha)- రాకింగ్ రాకేశ్ (Rocking Rakesh) ఒక్కటయ్యారు. ఇన్నాళ్లు ప్రేమించుకుంటున్న వారిద్దరూ తాజాగా వివాహం చేసుకున్నారు. సుజాత మెడలో రాకేశ్ మూడుముళ్లు వేశాడు. వీరి పెళ్లి వేడుక తిరుపతిలో ఆడంబరంగా జరిగింది. ఈ వేడుకకు బుల్లితెరతో పాటు సినీ ప్రముఖులు హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు.
కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న వారిద్దరూ చాలా షోలలో కలిసి సందడి చేస్తున్నారు. తమ ప్రేమ బంధానికి వారి కుటుంబసభ్యులు అంగీకారం తెలపడంతో ఇక వారిద్దరూ ఒక్కయ్యారు. ఓ న్యూస్ చానల్ లో ‘జోర్దార్ న్యూస్’ షో ద్వారా సుజాత యాంకర్ (Anchor)గా కెరీర్ ప్రారంభించింది. దాని ద్వారా ఆమెకు జోర్దార్ సుజాతగా పేరొచ్చింది. తెలంగాణ (Telangana Slang) యాసలో మాట్లాడుతూ వైరల్ గా మారడంతో బిగ్ బాస్ (Bigg Boss Show) షోలో ఆమెకు అవకాశం వచ్చింది. అనంతరం జబర్దస్త్ షోలోకి పిలుపు రావడంతో అక్కడికి వెళ్లింది. ఇక జబర్దస్త్ ప్రారంభమైనప్పటి నుంచి రాకేశ్ ఉన్నాడు. చిన్నపిల్లలతో స్కిట్లు చేస్తూ మంచి పేరు సంపాదించాడు. కొన్ని సినిమాల్లో కూడా నటించారు. వీరిద్దరికీ జబర్దస్త్ లో పరిచయమైంది. అతడి స్కిట్స్ లో నటిస్తుండడంతో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.
ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట తిరుపతిలో వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు ఏపీ మంత్రి ఆర్కే రోజా తన భర్త సెల్వమణితో కలిసి హాజరయ్యారు. కొత్త దంపతులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు జబర్దస్త్ షో నటీనటులంతా హాజరై సందడి చేశారు. కాగా వీరిద్దరూ యూట్యూబ్ చానల్స్ ప్రారంభించారు. తమ చానళ్ల ద్వారా వ్యక్తిగత విషయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే యూట్యూబ్ ద్వారానే తమ ప్రేమ విషయం, నిశ్చితార్థం, పెళ్లి విషయాలు పంచుకున్నారు.