నంద్యాల: రుద్రవరం మండలం చాకలి పేటకు చెందిన పకీరయ్య శనివారం అంతర్జాతీయ వేదికపై విశేష గుర్తింపు పొందారు. రష్యా రాజధాని మాస్కోలోని సిటీ హైస్కూల్లో జంప్ రోప్ ట్రైనర్‌గా సేవలు అందిస్తూ.. తన ప్రతిభను చాటుకున్నారు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా ప్రతిష్ఠాత్మక ‘ఉత్తమ జంప్ రోప్ ట్రైనర్ అచీవ్మెంట్ అవార్డు’ అందుకున్నారు.