E.G: పేదరికాన్ని జయించి చాలామంది ప్రభుత్వ కొలువులు సాధిస్తున్నారు. వారి సక్సెస్ స్టోరీలు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాయి. కడియం మండలం దామిరెడ్డిపల్లికి చెందిన చింతపర్తి దీప్తి ఎక్సైజ్ ఎస్సైగా ఎంపికై మంగళవారం బాధ్యతలు స్వీకరిస్తుంది. తండ్రి రాజు 7వ తరగతి మాత్రమే చదివాడు. తల్లి సుమలత పదో తరగతి చదివి అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తుంది.