HYD: GHMC, MMC, CMC కార్పొరేషన్ల పరిధిలో రోడ్లపై గార్బేజి, నిర్మాణ వ్యర్ధాలు కనిపిస్తే ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం వాట్సాప్ సర్వీస్ ప్రారంభించినట్లు జీహెచ్ఎంసీ తెలిపింది. కానీ.. GHMC మాటలు కేవలం మాటలకే పరిమితమయ్యాయి. ప్రతిసారి సాంకేతిక సమస్యలు వస్తున్నాయని, ఫిర్యాదు చేసిన తర్వాత, ఫిర్యాదు యొక్క స్టేటస్ తెలియడంలేదని నగర వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.