HYD: ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొ.ఖాసిం రాజకీయ నాయకులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించడాన్ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.కళ్యాణ్ నాయక్ ఖండించారు. ఒక విద్యా సంస్థలో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం నియమావళికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఇది అనవసర వివాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.