India to overtake China as world’s most populous country by mid-2023: UN report
India:ప్రపంచ జనాభాలో ఇండియా (india) నంబర్ వన్ స్థానానికి చేరింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి (un) తెలిపింది. భారత జనాభా 1.4286 బిలియన్లు అని.. చైనా 1.4275 బిలియన్లతో సెకండ్ ప్లేస్లో ఉందని.. 340 మిలియన్ల జనాభాతో అమెరికా మూడో స్థానంలో నిలిచిందని ‘స్టేట్ ఆప్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్’లో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్స్ పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలతో ఉన్న సమాచారంతో అంచనా వేసింది.
భారత్, చైనా (china) నుంచి జనాభాకు సంబంధించి సమాచారం అందలేదని పేర్కొంది. భారతదేశంలో (india) 2011 తర్వాత జనగణన చెపట్టలేదు. ప్రతీ పదేళ్లకోసారి గనగణన చేస్తుంటారు. 2021లో జనాభా లెక్కల ప్రక్రియ కరోనా వైరస్ వల్ల చేపట్టని సంగతి తెలిసిందే.
ప్రపంచ జనాభా 8.045 బిలియన్లలో ఇండియా, చైనా మూడింట ఒక వంతుల పాపులేషన్ కలిగి ఉంది. అయినప్పటికీ ఆసియాలో జనాభా పెరుగుదల తక్కువగా ఉంది. ఇండియాతో పోలిస్తే చైనాలో కాస్త ఎక్కువ పెరుగుదల ఉంది.
గత ఏడాది చైనా జనాభా దారుణుంగా పడిపోయింది. ఆరు దశాబ్దాల్లో ఎప్పుడూ ఇంత తక్కువ జనాభా నమోదు కాలేదు. ఆర్థిక వ్యవస్థ, ఇతర కారణాల దృష్ట్యా తగ్గింది. భారతదేశ వార్షిక జనాభా వృద్ది 2011 నుంచి సగటున 1.2 శాతం ఉంటుంది. అంతకుముందు అదీ 1.7 శాతంగా ఉండేది.
చైనాలో జననాల రేటు పడిపోయింది. జనాభా తగ్గిపోతూ, వృద్ధుల సంఖ్య పెరిగిపోతుండటంతో అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయింది. పిల్లలను కనాలని ప్రోత్సహించినప్పటికీ ఫలితం దక్కడం లేదు. అక్కడి ప్రజల్లో చాలా మంది పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం భారత జనాభాలో నాలుగో వంతు 14 ఏళ్ల లోపు పిల్లలే. 65 ఏళ్లకు పైబడిన వారు 7 శాతం మంది ఉన్నారు.