ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్ వంటి దేశాల్లో మహిళల విషయంలో దారుణ సంఘటనలు జరుగుతున్నాయి. మహిళలపై వివక్ష కొనసాగుతోంది. ఈ దేశాల్లో పాలకుల నుంచి మహిళలు, బాలికల పట్ల కఠిన రూల్స్ ఎదురవుతున్నాయి. తాజాగా ఇరాన్ లో బాలికలను విద్యకు దూరం చేసేందుకు వారిపై విష ప్రయోగం చేసిన ఘటన వెలుగుచూసింది.
ఇరాన్(Iran), ఆఫ్ఘనిస్థాన్(Afghanisthan) వంటి దేశాల్లో మహిళల విషయంలో దారుణ సంఘటనలు జరుగుతున్నాయి. మహిళలపై వివక్ష కొనసాగుతోంది. ఈ దేశాల్లో పాలకుల నుంచి మహిళలు, బాలికల పట్ల కఠిన రూల్స్ ఎదురవుతున్నాయి. తాజాగా ఇరాన్(Iran)లో బాలికలను విద్యకు దూరం చేసేందుకు వారిపై విష ప్రయోగం చేసిన ఘటన వెలుగుచూసింది. ఈ విషయాన్ని ఇరాన్(Iran) మంత్రి యునెస్ పనాహీ వెల్లడించారు. గత ఏడాది నవంబర్ చివరి నుంచి ఇటువంటి ఘటనలు ఎక్కువవుతున్నాయి. విద్యార్థులపై ఈ విష ప్రయోగం ఉద్దేశపూర్వకంగానే జరిగినట్లు అధికారులు తెలిపారు.
ఇరాన్(Iran)లోని ఖోమ్ పాఠశాలలో చాలా మంది బాలికలపై విషప్రయోగం జరిగింది. బాలికల పాఠశాలను మూసివేసి వారిని విద్య(Education)కు దూరం చేసేందుకు పాలకులు దురుద్దేశంతోనే వ్యవహరిస్తున్నారు. బాధిత బాలికల్లో కొంత మంది ఆస్పత్రి పాలవ్వడంతో వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. విష ప్రయోగం వల్ల బాలికలు శ్వాసకోశ సమస్యలు(Breathing Problems) ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని ఇరాన్(Iran) అధికారిక మీడియి ఐఆర్ఎన్ఏ వెల్లడించింది.
ఇటువంటి కుట్ర వెనుక ఎవరున్నారనే విషయాలను మాత్రం ఇంకా తెలుపలేదు. అలాగే ఈ ఘటనకు సంబంధించి ఇంత వరకూ ఎవ్వర్నీ అరెస్ట్ చేయలేదు. ఇరాన్(Iran)లో బాలికలపై విషప్రయోగం వల్ల అస్వస్థతకు గురైన బాలికల తల్లిదండ్రులు నగర గవర్నర్ నివాసం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై అధికారులు తమకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో విషప్రయోగానికి గల కారణాలు తెలుసుకునేందుకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి అలీ బమదోరి జహ్రోమీ ఓ ప్రకటనలో తెలిపారు.