»How Indian Coast Guard Seized 20 Crore Worth Gold Smuggled From Sri Lanka Watch Video
Indian Coast Guard : సముద్రంలో 33కిలోల బంగారం పట్టుకున్న ఇండియన్ కోస్ట్ గార్డ్
ఇండియన్ కోస్ట్ గార్డ్(Indian Coast Guard) సముద్రంలో భారీగా బంగారాన్ని(gold) పట్టుకుంది. దాదాపు 33 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. సినిమాటిక్ స్టైల్లో కోస్ట్ గార్డ్ ఈ ఆపరేషన్ నిర్వహించింది.
Indian Coast Guard : ఇండియన్ కోస్ట్ గార్డ్(Indian Coast Guard) సముద్రంలో భారీగా బంగారాన్ని(gold) పట్టుకుంది. దాదాపు 33 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. సినిమాటిక్ స్టైల్లో కోస్ట్ గార్డ్ ఈ ఆపరేషన్ నిర్వహించింది. DRI , కస్టమ్తో కలిసి ఈ ఆపరేషన్ చేశారు. తమిళనాడు(Tamilnadu)లోని మన్నార్(Mannar) ప్రాంతంలో 32.689 కిలోల బంగారాన్ని ఐసీజీ(ICG)స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు రూ.20 కోట్లు.
ఇంటెలిజెన్స్ ఆధారంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఇండియన్ కోస్ట్‌గార్డ్ అధికారి తెలిపారు. శ్రీలంక(Srilanka) నుంచి భారత్‌కు చేపల పడవలో బంగారాన్ని తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ గురించి మరింత సమాచారం ఇస్తూ.. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇన్స్పెక్టర్ జనరల్ మనీష్ పాఠక్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆపరేషన్, ICG ఈ ఆపరేషన్ ఎలా నిర్వహించిందో చెప్పారు.
బోట్లపై ఐసీజీ గట్టి నిఘా ఉంచింది
సముద్రంలో చేపలు పట్టే పడవ(Boats)లపై భారత తీర రక్షక దళం గట్టి నిఘా ఉంచిందని పాఠక్ చెప్పారు. ఆపరేషన్ సమయంలో ఒక పడవను స్వాధీనం చేసుకోగా, పడవలో ఉన్న అక్రమదారులు బంగారాన్ని సముద్రంలోకి విసిరారని తెలిపారు. వార్తా సంస్థ ANI ఈ ఆపరేషన్ వీడియోను షేర్ చేసింది. డైవింగ్ ఆపరేషన్ ఈ వీడియోలో చూపబడింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది సముద్రంలోకి ప్రవేశించి 33 కిలోల బంగారు సరుకును స్వాధీనం చేసుకున్నారు. సరుకును అందుకోగానే తాళ్ల సాయంతో పడవలోకి తీసుకెళ్తున్నారు.
#WATCH | How Indian Coast Guard personnel, along with the DRI officials and Customs, carried out the special operation to seize 32.689 kgs of Gold valued at approx. Rs 20.2 Crores, from two fishing boats at the Gulf of Mannar area off Tamil Nadu.