NGKL: జిల్లా చారకొండ మండలం కమ్మలపూర్ తండాలో బుధవారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి మంగ్య నాయక్ అనే రైతు పొలంలో రెండు పాడి ఆవులు మృతిచెందినట్లు బాధితుడు తెలిపారు. చనిపోయిన ఆవుల విలువ సుమారు రూ. లక్ష ఉంటుందని పేర్కొన్నారు. బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.