SKLM: నరసన్నపేట మండలం జమ్ము జాతీయ రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందారు. శుక్రవారం ఉదయం జమ్ముకు సమీర్ ద్విచక్ర వాహనంపై అతివేగంగా వెళ్లడంతో అదే దిశగా వస్తున్న జగనన్న కాలనీకి చెందిన చౌదరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సమీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. చౌదరికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.