»Cristiano Ronaldo Receives Guinness World Record Award
Cristiano Ronaldo: గిన్నీస్ రికార్డ్ సృష్టించిన పోర్చుగీస్ ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో
క్రిస్టియానో రొనాల్డో ఎక్కువ ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ క్యాప్‌లు సాధించిన పురుష ఆటగాడిగా కూడా ఖ్యాతి దక్కించుకున్నాడు. దీనితో గిన్నిస్ రికార్డు అతని సొంతం అయింది.
Cristiano Ronaldo: పోర్చుగీస్ ఫుట్ బాల్ ప్లేయర్, ఆల్ టైమ్ అందరి ఫేవరేట్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఏకంగా 200 అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌ల ఆటగాడిగా రొనాల్డో గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కాడు. మునుపెవ్వరూ సాధించని విధంగా తను ఈ రికార్డు నెలకొల్పాడు. UEFA 2024 క్వాలి ఫయింగ్ కోసం ఐస్‌ల్యాండ్‌తో పోర్చుగల్ తలపడింది. ఈ మ్యాచ్ ఆడిన రొనాల్డో తాను చేసిన గోల్ ద్వారా పోర్చుగల్‌ను 1-0 తేడాతో గెలిపించాడు. ఆ ఏకైక గోల్ కూడా 38 ఏళ్ల రొనాల్డో సాధించినదే కావడం విశేషం.
దీనిద్వారా 200 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన ఘనత సాధించాడు. అంతేకాదు ఎక్కువ ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ క్యాప్‌లు సాధించిన పురుష ఆటగాడిగా కూడా ఖ్యాతి దక్కించుకున్నాడు. దీనితో గిన్నిస్ రికార్డు అతని సొంతం అయింది. అతని ఫ్యాన్స్ ఈ న్యూస్ విని సంబరాలు చేసుకుంటున్నారు. పోర్చుగల్ తరఫున 200 మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కడం తన అదృష్టంగా రొనాల్డో పేర్కొన్నాడు. తనకు ఫుట్ బాల్ ఆటపై, తన దేశంపై ఉన్న ప్రేమకు ఇది రుజువన్నాడు. అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక మ్యాచ్‌లు కువైట్‌కు చెందిన ఆటగాళ్లు బాదర్ అల్ ముతావా (196 మ్యాచ్ లు), మలేషియాకు చెందిన చిన్ అన్ (195), ఈజిప్ట్‌కు చెందిన అహ్మద్ హసన్ (184), భారత్‌కు చెందిన సునీల్ ఛెత్రీ (137 మ్యాచ్‌లు) తరువాతి వరుసలో ఉన్నారు.