KRNL: సమాజాభివృద్ధిలో మహిళలదే కీలక పాత్ర అని జడ్పీ పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ఈరన్న స్పష్టం చేశారు. సోమవారం పెద్దకడబూరు మండలంలోని కంబళదిన్నె గ్రామ జడ్పీ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులు నాగజ్యోతి, సునీత, రాజ్యలక్ష్మి, హేమలను శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు.