»Case Against Priyanka Gandhi Pa Sandeep Kumar Bigg Boss 16 Actress For Indecent Behavior
Priyanka Gandhi: పీఏ సందీప్ కుమార్‌పై కేసు..నటితో అసభ్య ప్రవర్తన
బిగ్ బాస్ 16 ఫేమ్ అర్చన గౌతమ్‌తో 'అసభ్యంగా ప్రవర్తించిన' క్రమంలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) వాద్రా పీఏ(PA) సందీప్ కుమార్(Sandeep Kumar)పై కేసు(case) నమోదైంది. అర్చన గౌతమ్ తండ్రి ఫిర్యాదు మేరకు యూపీ మీరట్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi) పీఏ(PA) సందీప్ కుమార్(Sandeep Kumar)పై ఉత్తర్ ప్రదేశ్(uttar pradesh) లోని పార్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బిగ్ బాస్-16లో టాప్ 5 ఫైనలిస్ట్ అయిన అర్చన గౌతమ్(Archana goutam).. తండ్రి, తన కుమార్తెను చంపేస్తామని ఆయన బెదిరింపులకు పాల్పడ్డారని అతను ఆరోపిస్తూ కంప్లైంట్ చేశారు. ఈ క్రమంలో అర్చన గౌతమ్ స్వయంగా ఈ సమాచారాన్ని ఫేస్బుక్ లైవ్(facebook live) ద్వారా ప్రకటించారు. తమను కులపరమైన మాటలు మాట్లాడుతూ దూషించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసిన మీరట్ పోలీసులు(police) సందీప్ సింగ్‌పై 504, 506 సెక్షన్ల ప్రకారం నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) ఆహ్వానం మేరకు కాంగ్రెస్ జనరల్ కన్వెన్షన్‌కు హాజరయ్యేందుకు 2023 ఫిబ్రవరి 26న ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు తన కుమార్తె వెళ్లిందని అర్చన గౌతమ్ తండ్రి గౌతమ్ బుద్ పేర్కొన్నారు. ఆ క్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కలవడానికి అతని కుమార్తె PA సందీప్ సింగ్ నుంచి సమాచారం కోరినట్లు తెలిపారు. ఆ నేపథ్యంలో ప్రియాంక గాంధీకి ఆమెను పరిచయం చేసేందుకు అతను నిరాకరించాడని చెప్పాడు. దీంతోపాటు అర్చనతో కుల ద్వేషం, అసభ్య పదజాలంతో అతను మాట్లాడాడని చెప్పాడు. అంతే కాకుండా చంపేస్తానని బెదిరించాడని గౌతమ్ తండ్రి ఆరోపించారు.