»Brs Chief Cm Kcr And Ktr Shocked Karepalli Blast Incident Pays Condolence
Karepalli Blastపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి.. మృతులకు సంతాపం
మరణించిన కార్యకర్తల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఆ కుటుంబాలకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలందించాలని ఆదేశించారు.
ఆత్మీయ సమ్మేళనంలో జరిగిన విషాద సంఘటనపై బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అధినేత, సీఎం కె.చంద్రశేఖర్ రావు (K Chandrashekar Rao) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రమాదంపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (, ఎంపీ నామా నాగేశ్వర్ రావుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.
ఖమ్మం జిల్లా (Khammam District) కారేపల్లి మండలం చీమలపాడులో (Cimalapadu) బుధవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ నామ నాగేశ్వర్ రావు (Nama Nageswara Rao), వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ (Ramulu Naik) వస్తున్నారు. వారు సమావేశానికి వస్తున్న సందర్భంగా బాణసంచా (Crackers) కాల్చారు. ఆ బాణసంచా నిప్పురవ్వులు గుడిసెపై పడ్డాయి. ఆ గుడిసెలోని సిలిండర్లు పేలి భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా.. మరికొందరు గాయపడ్డారు. ఊహించని సంఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి, విచారాన్ని వ్యక్తం చేశారు. మరణించిన కార్యకర్తల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఆ కుటుంబాలకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలందించాలని మంత్రి అజయ్, ఎంపీ నాగేశ్వర్ రావుకు ఆదేశించారు.
ఈ సంఘటన విషయం తెలుసుకున్న మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KT Rama Rao) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్న కేటీఆర్ విషయం తెలుసుకుని వివరాలు ఆరా తీశారు. మంత్రి పువ్వాడ, ఎంపీలకు ఫోన్లు వివరాలు తెలుసుకున్నారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు అండగా ఉంటామని ఫోన్ లలో భరోసా ఇచ్చారు. కాగా ఈ సంఘటనలో మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదం పట్ల బీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు.