జమ్మూ కశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలోని మార్వా ప్రాంతంలోని మచ్నా వద్ద అధునాతన తేలికపాటి ఆర్మీ హెలికాప్టర్(army helicopter) ధ్రువ్ కూప్ప కూలిపోయింది. అయితే ఈ ఘటన సమయంలో హెలికాప్టర్లో ముగ్గురు వ్యక్తులు ఉండగా.. ఇద్దరు గాయపడినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. విషయం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది చర్యలు చేపడుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు గత రెండు నెలల్లో ALH ధృవ్‌కి సంబంధించి ఇది మూడవ క్రాష్ కావడం చర్చనీయాంశంగా మారింది.