BDK: జూలూరుపాడు రైతు వేదికలో గురువారం మండల స్థాయి సభను నిర్వహించారు. ఈ సభకు జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ద్వారా రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిలలో సమస్యలను గుర్తించి పరిష్కరించే ప్రక్రియ వేగవంతమవుతోందన్నారు. ప్రభుత్వం పథకాలు పేదలకు చేరే విధంగా చూడాలన్నారు.