హర్యానాలోని అంబాలా నుంచి మూడుసార్లు బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి రత్తన్ లాల్ కటారియా(72)(Rattan Lal Kataria) గురువారం పీజీఐ ఆస్పత్రిలో మృతి చెందారు.
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ(BJP MP) రతన్ లాల్ కటారియా(72)(Rattan Lal Kataria) కన్ను మూశారు. గత కొంతకాలంగా ఆయన న్యూమోనియాతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చండీగఢ్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఎంపీ రత్తన్ లాల్ కటారియా మృతి పట్ల హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సంతాపం వ్యక్తం చేశారు. ఈరోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించే అవకాశం ఉంది.
హర్యానాలోని అంబాలా లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచిన కటారియా.. 2019 నుంచి 2021 వరకు కేంద్ర మంత్రిగా పని చేశారు. 1951లో జన్మించిన రతన్ లాల్ బీజేపీ అధికార ప్రతినిధిగా, అధ్యక్షుడిగా, మంత్రిగా పనిచేశారు.
2019 సాధారణ ఎన్నికల్లో అంబాలా నుంచి మూడోసారి ఎంపీగా గెలిచారు. 2021 వరకు కేంద్రం జల్ శక్తి, సామాజిక న్యాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.