న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు తొలగింపు..అతని స్థానంలో అర్జున్ రామ్ మేఘ్వాల్
కేంద్ర న్యాయ మంత్రిగా పని చేస్తున్న కిరణ్ రిజిజును తొలగించారు. ఈ క్రమంలో భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. అతని స్థానంలో అర్జున్ రామ్ మేఘ్వాల్ని లా మినిస్టర్ గా తీసుకున్నారు. అయితే కొలిజియం వ్యవస్థపై అనేక సార్లు కిరణ్ రిజిజు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కొత్త కేంద్ర న్యాయ శాఖ మంత్రి రాజస్థాన్‌లోని బికనీర్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు మేఘవాల్‌కు లా అండ్ జస్టిస్ మంత్రిత్వ శాఖలో రాష్ట్ర మంత్రిగా స్వతంత్ర బాధ్యతలు అప్పగించారు. ఇది అతని ప్రస్తుత పోర్ట్‌ఫోలియోలకు అదనంగా కేటాయించారు. ఈ పోర్ట్‌ఫోలియోలలో అనూహ్య మార్పులను పునర్వ్యవస్థీకరిస్తూ రాష్ట్రపతి భవన్ ప్రకటించింది.
Is it because of the Maharashtra judgement embarrassment? Or the Modani- SEBI investigation?
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) May 18, 2023
కేంద్ర ప్రభుత్వం తన ప్రతిష్టను కాపాడుకోవడానికి రిజిజును తొలగించిందని ఈ పరిణామంపై కాంగ్రెస్‌కు చెందిన అల్కా లాంబా ట్విట్టర్లో పేర్కొన్నారు.
पिछले कुछ समय से कानून मंत्री के तौर @KirenRijiju द्वारा जजों की नियुक्ति और अदालतों के काम करने के तौर तरीकों को लेकर की जा रही टिप्पणियों और हस्तक्षेप ने मोदी सरकार के लिए मुश्किलें खड़ी कर दी थीं, सरकार ने अपनी छवि बचाने के लिए अपने क़ानून मंत्री की बलि देकर अच्छा किया. https://t.co/cXDM9R8kjI