»Youtube Removed More Than 1000 Celebrities Ads What Is The Reason
YouTube: వెయ్యికిపైగా యాడ్స్‌ను తొలగించిన యూట్యూబ్.. కారణం ఏంటంటే?
ఏఐ టెక్నాలజీతో కొందరు కేటుగాళ్లు చేస్తున్న డీప్ ఫేక్ వీడియోలు యూట్యూబ్‌కు తలనొప్పిగా మారాయి. దీంతో 404 మీడియా పరిశోధించడంతో వెయ్యి యాడ్ వీడియోలను యూట్యూబ్ తొలగించింది.
YouTube removed more than 1000 celebrities ads.. What is the reason?
YouTube: పెరుగుతున్న సాంకేతికతతో లాభం ఎంత ఉందో నష్టం కూడా అంతే ఉంది. టెక్నాలజీతో కొందరు అతి తెలివిని ఉపయోగిస్తున్నారు. తమ వ్యాపారాలకు ప్రముఖుల వాయిస్‌ను, ఫేస్‌ను వాడుతున్నారు. దీనికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా పలు కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో యూట్యూబ్‌కు ఓ పెద్ద చిక్కు ఎదురైంది. సెలబ్రిటీలు, ప్రముఖుల డీప్‌ఫేక్ వీడియోలను విచ్చవిడిగా వాడడంపై ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే యూజర్లను తప్పుదోవ పట్టించే వీడియోలను యూట్యూబ్(YouTube ) తొలగించింది.
సెలబ్రిటీలపై వస్తున్న నకిలీ వీడియోలపై 404 మీడియా దృష్టి పెట్టింది. ప్రముఖ గాయని టేలర్ స్విఫ్ట్, నటుడు స్టీవ్ హార్వే మరికొందరు ప్రముఖుల వీడియోలు ఉన్నాయి. ఏఐ టెక్నాలజీతో మొత్తం 1000కి పైగా నకిలీ యాడ్లను యూట్యూబ్ తొలగించింది. ఇప్పటివరకు ఈ డీప్‌ఫేక్ వీడియోలను 200 మిలియన్ల మంది చూశారు. ఏఐ(AI)ని ఉపయోగించి కంటెంట్ క్రియేట్ చేస్తున్న వీడియోలపై యూట్యూబ్ అసహనం వ్యక్తంచేసింది. వీటిపై చర్యలు తీసుకుంటాము అని తెలిపింది.