»Aishwarya Reacts To Trolls Rajinikanth Is Emotional
Rajinikanth: ట్రోల్స్ పై స్పందించిన ఐశ్వర్య.. రజనీకాంత్ ఎమోషనల్
రజనీకాంత్‌ను ఈ మధ్య సంఘీ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారని ఐశ్వర్య పేర్కొన్నారు. పార్టీకి మద్దతు ఇచ్చేవారిని సంఘీ అంటారు, కానీ ఆయన ఏ పార్టీకి మద్దతు ఇవ్వడు అలా అయితే లాల్ సలామ్ చిత్రంలో నటించే వాడు కాదు అని ఎమోషనల్ అయ్యారు. ఆమె మాటలకు రజనీ కంటనీరు పెట్టుకున్నారు.
Aishwarya reacts to trolls.. Rajinikanth is emotional
Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య(Aishwarya) దర్శకత్వం వహించిన తాజా చిత్రం లాల్ సలామ్(Laal Salam). దీనికి సంబంధించిన ఆడియో లాంచ్ వేడుక చెన్నైలో శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా లాల్ సలామ్ చిత్ర దర్శకురాలు ఐశ్వర్య మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన తండ్రిపై, తనపై గత కొంత కాలంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. తాను సోషల్ మీడియాకు కాస్త దూరంగానే ఉంటానని తెలిపారు. అయితే తన టీమ్ కొన్ని ట్రోల్స్ చూపించారని, అందులో రజనీకాంత్‌ను సంఘీ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. సంఘీ అంటే రాజకీయ పార్టీలకు సపోర్ట్ చేసేవాడు అని ఈ మధ్యే తెలుసుకున్నాని వెల్లడించారు. అయితే తన తండ్రి ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ కాదని, అలా అయితే ఈ సినిమా చేసేవాడే కాదని ఐశ్వర్య పేర్కొన్నారు. ఈ మాటలకు రజనీకాంత్(Rajinikanth) ఎమోషనల్ అయ్యారు.
రజనీకాంత్ మాట్లాడుతూ.. లాల్ సలామ్ కథ చాలా బాగుందని, విన్నప్పుడే తాను ఆ క్యారెక్టర్ చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. జైలర్ ఈవెంట్లో అర్థం అయ్యిందా రాజా అన్న మాటలను తప్పుగా ట్రోల్స్ చేశారని, తలపతి విజయ్‌ని ఆపాదించి మాట్లాడినట్లు చిత్రీకరించారు అని, అలాంటిది ఏం లేదని స్పష్టం చేశారు. విజయ్ నా కళ్లముందు ఎదిగిన నటుడు, కష్టపడి పెద్ద స్టార్‌గా ఎదిగారు ఆయనంటే ఎంతో గౌరవం అని పేర్కొన్నారు. నాకు ఎవరు పోటీ కాదు అని తనకు తానే పోటీ అని అన్నారు. ఎవరిని ఎవరితో పోల్చవద్దని ఆయన అభిమానులకు కూడా సూచన చేశారు. లాల్ సలామ్ చిత్రానికి సంగీతం అందించిన ఏఆర్ రెహ్మాన్‌కు కథ చాలా నచ్చిందని, తెరకెక్కించిన తీరు కూడా ఎంతో నచ్చిందని చెప్పారు. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని తెలిపారు.