హృతిక్ రోషన్ హీరోగా బాలీవుడ్ నుంచి వచ్చిన స్పై థ్రిల్లర్ యాక్షన్ ఎంటర్టనైర్ ఫైటర్. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో రెండు రోజుల్లో భారీ వసూళ్లను రాబట్టింది.
Hrithik Roshan: లాస్ట్ ఇయర్ జనవరి 25న రిలీజ్ అయిన షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను సొంతం చేసుకుంది. వెయ్యి కోట్లకు పైగా రాబట్టి షారుఖ్‌కు సాలిడ్ కంబ్యాక్ ఫిల్మ్‌గా నిలిచింది పఠాన్. డైరెక్టర్ సిద్ధార్త్ ఆనంద్ కింగ్‌ఖాన్‌కు కింగ్ సైజ్ హిట్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు సరిగ్గా జనవరి 25న హృతిక్ రోషన్‌ను ‘ఫైటర్’గా చూపిస్తూ ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చాడు సిద్ధార్త్. దీపిక పదుకొనే హీరోయిన్గా నటించిన ఈ సినిమా ట్రైలర్‌తో మంచి హైప్ క్రియేట్ చేసింది. పఠాన్ సినిమాను నేలపై నడిపించిన సిద్ధార్త్.. ఫైటర్‌ను ఏరియల్ యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కించాడు.
జనవరి 25న రిలీజ్ అయిన ఈ సినిమా సాలిడ్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో డే వన్ ఫైటర్‌కు డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే డే వన్ కంటే సెకండ్ డే రిపబ్లిక్ డే సందర్భంగా హాలీడే కావడంతో ఫైటర్ కలెక్షన్స్ పెరిగాయి. మొదటి రోజు 23 కోట్ల వరకు నెట్ రాబట్టిన ఫైటర్.. రెండో రోజు 39 కోట్లు నెట్ వసూలు చేసింది. మొత్తంగా రెండు రోజుల్లో 62 కోట్ల వరకు నెట్ రాబట్టింది. గ్రాస్ లెక్కల ప్రకారం 90 కోట్లు కొల్లగొట్టింది. ఇక వీకెండ్ స్టార్ట్ అయింది కాబట్టి.. ఫైటర్ కలెక్షన్స్‌లో మరింత గ్రోత్ కనిపించే ఛాన్స్ ఉంది.
ఈ మూవీకి దాదాపు 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. రెండు రోజుల్లోనే సెంచరీకి చేరువైన ఫైటర్.. ఈ వీకెండ్లో డబుల్ సెంచరీ కొట్టిన కొట్టొచ్చు. అయితే.. ఈ సినిమాను గల్ఫ్ దేశాల్లో బ్యాన్ చేశారు. దీంతో ఓవర్సీస్లో 2 మిలియన్ డాలర్లు మాత్రమే రాబట్టింది. కానీ ఫైటర్ మూవీ బాలీవుడ్ భారీ వసూళ్లు నమోదు చేసే ఛాన్స్ ఉంది.