Nithin: ‘రాబిన్ హుడ్’గా నితిన్.. హిట్ కొట్టేలానే ఉన్నాడు!
ప్రతిసారి హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్న నితిన్‌కు నిరాశే మిగులుతోంది. కానీ ఈసారి మాత్రం హిట్ కొట్టేలానే ఉన్నాడు. తాజాగా కొత్త సినిమా టైటిల్ అనౌన్స్ చేసి.. సినిమా పై అంచనాలు పెంచేశాడు నితిన్.
Nithin: గత కొన్నాళ్లుగా సరైన హిట్ అందుకోలేకపోతున్నాడు నితిన్. ఇటీవల రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన ఎక్స్ట్రార్డినరీ మ్యాన్‌తో కూడా హిట్ కొట్టలేకపోయాడు. దీంతో అప్ కమింగ్ ప్రాజెక్ట్స్‌తో ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. తనకు భీష్మతో హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో ఓ సినిమా చేస్తున్నాడు నితిన్. 2020లో వచ్చిన భీష్మ సినిమా తర్వాత ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయిన నితిన్.. మరోసారి వెంకీ కుడుములతో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.
VN2 వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి.. ‘అన్ మాస్కింగ్ ది కాన్ మాన్’ అంటూ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ముందుగా చెప్పినట్టుగానే జనవరి 26న ఉదయం 11:07 నిమిషాలకి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. నిమిషమున్నర నిడివి ఉన్న గ్లింప్స్ నితిన్ వాయిస్ ఓవర్‌తో మొదలైంది. ‘డబ్బు చాలా చెడ్డది. రూపాయి రూపాయి నువ్వు ఏం చేస్తావ్ అంటే, అన్నదమ్ములని విడదీస్తాను అని చెప్పిందంట. అన్నంత పనీ చేసింది, అన్నదమ్ములని విడదీసింది. నా వాళ్లే కదా అని జేబులో చేతులు పెట్టి డబ్బులు తీసుకుంటే నన్ను దొంగ అని నాపై కేసులు పెట్టారు.
అయినా నేను బాధపడను ఎందుకంటే ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్..’ అనే డైలాగ్‌తో హీరో క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే.. రాబిన్ హుడ్ అనే టైటిల్‌ని రివీల్ చేశారు. ఇక గ్లింప్స్ చూసిన తర్వాత మరోసారి నితిన్, వెంకీ కుడుముల హిట్ కొట్టేలానే ఉన్నారు. ఈ గ్లింప్స్ జీవీ ప్రకాష్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. మరి నితిన్ రాబిన్ హుడ్‌తో హిట్ కొడతాడేమో చూడాలి.