గత కొన్నాళ్లుగా సరైన హిట్ అందుకోలేకపోతున్నాడు హీరో నితిన్. నాగ చైతన్య పరిస్థితి కూడా అదే. అలాంటి ఈ ఇద్దరు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఇద్దరిలో ఎవరైనా తగ్గుతారా? లేదా?
Nithin-Nagachaithanya: Naga Chaitanya to compete with Nithin?
Nithin-Nagachaithanya: చివరగా వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన ఎక్స్ట్రార్డినరీ మ్యాన్‌తో కూడా హిట్ కొట్టలేకపోయాడు. ప్రస్తుతం నితిన్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో తనకు భీష్మతో హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో రాబిన్‌హుడ్ అనే సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ మంచి బజ్ క్రియేట్ చేసింది. అయితే.. రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు మేకర్స్.
తాజాగా శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటించింది చిత్ర యూనిట్. రాబిన్ హుడ్ సినిమాని డిసెంబర్ 20న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. డిసెంబర్ 20 శుక్రవారం నుంచి క్రిస్మస్ 25 వరకు ఆరు రోజుల హాలీడేస్ ఈ సినిమాకి కలిసి రానుంది. ప్రస్తుతానికి డిసెంబర్ స్లాట్ ఇంకా ఖాళీగానే ఉంది. ఇంకా ఏ సినిమా కూడా రిలీజ్ డేట్ ప్రకటించలేదు. అప్పటి వరకు పెద్ద సినిమాలేవి నితిన్‌కు పోటీగా రాకపోతే.. రాబిన్ హుడ్‌కి తిరుగుండదని అనుకున్నారు. కానీ ఇప్పుడు నాగా చైతన్య, నితిన్‌కు పోటీగా వస్తున్నట్టుగా తెలుస్తోంది.
గీతా ఆర్ట్స్ బ్యానర్లో చందు మొండేటి దర్శకత్వంలో రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా పాన్ ఇండియా లెవల్లో ‘తండేల్’ అనే సినిమా చేస్తున్నాడు చైతన్య. తాజాగా ఈ సినిమాకి కూడా రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ 20వ తేదీన తండేల్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారట. దీంతో వచ్చే డిసెంబర్లో నాగ చైతన్య వర్సెస్ నితిన్‌గా మారిపోయింది బాక్సాఫీస్ వార్. అయితే.. ఇటీవల తండేల్ సినిమాను దసరా సీజన్లో దేవర సినిమాకు పోటీగా రిలీజ్ చేస్తున్నారని అన్నారు. కానీ ఇప్పుడు డిసెంబర్‌కి వెళ్లినట్టుగా సమాచారం. మరి అఫిషీయల్‌గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి.