మనం రిజర్వేషన్ ట్రైన్ టికెట్లను బుక్ చేసుకునేందుకు ఐఆర్సీటీసీని ఉపయోగిస్తుంటాం. అయితే అన్ రిజర్వ్డ్ టికెట్లను బుక్ చేసుకోవడానికి మాత్రం నేరుగా స్టేషన్‌కు వెళ్లి క్యూలో నిలబడి టికెట్ తీసుకుంటాం. అయితే ఇందుకూ ఓ యాప్ ఉంది. దీని సహాయంతో లైన్లో నిలబడకుండానే ఫోన్లో టికెట్లు తీసుకోవచ్చు. ఎలాగంటే...?
Several trains have been canceled in Kazipet-Vijayawada route till the december 18th
UTS App For Train Ticket Booking : మనమంతా సౌకర్యంగా ప్రయాణం చేయాలనుకుంటే రైలును ఎంచుకుంటాం. రిజర్వేషన్ టికెట్ల కోసం ఐఆర్సీటీసీ ఇతర యాప్‌లను వాడుతుంటాం. అయితే అన్ రిజర్వ్డ్ టికెట్లను బుక్ చేసుకోవాలంటే చిక్కే. రైలు టైం అయిపోతున్నా స్టేషన్లో క్యూలో నిలబడి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు రైల్వే శాఖ అన్రిజర్వ్డ్ టికెట్ బుకింగ్ సిస్టమ్ (UTS) యాప్‌ను ప్రారంభించింది.
క్విక్ బుకింగ్, ఫ్లాట్ ఫాం టికెట్, సీజన్ టికెట్, క్యూఆర్ బుకింగ్ కోసం ఈ యూటీఎస్ యాప్ వాడొచ్చు. తక్కువ దూరం ప్రయాణం చేసేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నాన్-సబర్బన్ ట్రావెల్ టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటును కూడా యూటీఎస్(UTS) అందిస్తోంది. అంటే 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్న ప్రయాణానికి కూడా 3 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకోవచ్చు. 200 కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ఉంటే ప్రయాణం రోజే టికెట్ కొనుగోలు చేయాలి.
యూటీఎస్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.యాప్‌లో లాగిన్ అయిన తర్వాత స్క్రీన్‌పై కనిపించే Normal Booking సెక్షన్లోకి వెళ్లాలి. అందులో కనిపించే Book and travel, Book and Print ఆప్షన్లలో మీకు నచ్చిన దాన్ని సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ అడిగిన వివరాలన్నీ ఇచ్చి తేలికగా టికెట్ బుక్ చేసుకోవచ్చు.