కోనసీమ: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం అమలాపురంలో బుధవారం 1989 కానిస్టేబుల్ బ్యాచ్‌కు చెందిన ఆరుగురు ఏఎస్సైలు ఎస్సైలుగా పదోన్నతి పొందిన ఉద్యోగులు జిల్లా ఎస్పీ రాహుల్ మీనాను ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ వారందరికీ శుభాకాంక్షలు తెలిపి, మిఠాయిలు తినిపించి అభినందించారు. ఉద్యోగాన్ని బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు.