»Vikram Thangalan Another Making Video This Is Vikram
Vikram: ‘తంగలాన్’ మరో మేకింగ్ వీడియో.. ఇది విక్రమ్ అంటే!
చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విక్రమ్ ఏదైనా సినిమా చేస్తున్నాడంటే.. ఆ పాత్రం ఎంతో వైవిధ్యంగా ఉన్నట్టే. ప్రస్తుతం విక్రమ్ నటిస్తున్న తంగలాన్ సినిమా నుంచి మరో మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు.
Vikram: 'Thangalan' another making video.. This is Vikram!
Vikram: చియాన్ విక్రమ్.. ఈ పేరు వింటే చాలు, ఎలాంటి క్యారెక్టర్ అయిన భయపడాల్సిందే. సినిమా కోసం ఎంత రిస్క్ అయినా, ఏం చేయడానికైనా ముందుండే హీరోల్లో విక్రమ్ టాప్ ప్లేస్‌లో ఉంటాడు. శివపుత్రుడు, అపరిచితుడు లాంటి సినిమాలు చూస్తే.. విక్రమ్ యాక్టింగ్‌కు కొలమానం లేదనేలా ఉంటుంది. విక్రమ్ చేసే ప్రతి సినిమా వైవిధ్యంగానే ఉంటుంది. ముఖ్యంగా విక్రమ్ మేకోవర్ చూస్తే షాక్ అవాల్సిందే. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే.. యాక్టింగ్ అండ్ మేకోవర్ విషయంలో విక్రమ్ తర్వాతే ఎవ్వరైనా. తాజాగా విక్రమ్ కొత్త సినిమా నుంచి మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు.
An iconic talent, inspiring awe with grit and glory, delivering performances that defy expectations ❤️
పా.రంజిత్ దర్శకత్వంలో ‘తంగలాన్’ అనే సినిమాలో నటిస్తున్నాడు విక్రమ్. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. లేటెస్ట్గా ఏప్రిల్ 17న విక్రమ్ బర్త్ డే సందర్భంగా ‘తంగలన్’ నుంచి మరో మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో విక్రమ్‌ను చూస్తే ఔరా అనాల్సిందే. మొహానికి మసి పూసుకొని.. తన పాత్ర కోసం విక్రమ్ ఎంతలా కష్టపడ్డాడో ఈ మేకింగ్ వీడియోలో చూపించారు. ముఖ్యంగా విక్రమ్ కాస్ట్యూమ్స్, ఆ గెటప్ చూస్తే.. ఖచ్చితంగా ఈ సినిమా విక్రమ్ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్‌గా నిలిచిపోయేలా ఉంది.
ఇక ఈ సినిమా.. కేజీయఫ్ గనుల్లో జరిగిన కొన్ని నిజఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇది ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజియఫ్కి పూర్తి భిన్నమైన కథాంశంతో రూపొందుతోంది. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మాళవిక మోహనన్ హీరోయిన్గా నటిస్తోంది. మరి తంగలాన్ సినిమాతో విక్రమ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.