ఇక స్టార్ బ్యూటీ సమంత పనైపోయినట్టేనా? అనే సందేహాలు రాక మానదు. ప్రస్తుతం బ్రేక్ అంటూ సినిమాలకు దూరంగా ఉన్న సామ్.. చేతిలో ఉన్న సినిమాలను కూడా వదులుకుంటోంది. దీంతో సమంత వాట్ నెక్స్ట్? అనేది హాట్ టాపిక్‌గా మారింది.
Samantha: సమంత నటించిన లాస్ట్ ఫిల్మ్ ఖుషి. విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత సమంత నుంచి ఒక్క సినిమా కూడా రావడం లేదు. బాలీవుడ్లో సిటాడెల్ వెబ్ సిరీస్ తప్పితే సమంత అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఒక్కటి కూడా లేవు. అంతేకాదు.. ఇప్పటికే కమిట్ అయిన సినిమాల నుంచి కూడా సమంత తప్పుకుంటోంది. దాదాపు మూడేళ్ల క్రితం 2021 చివరలో సమంత నుంచి ఒక ఇంటర్నేషనల్ మూవీని అధికారికంగా ప్రకటించారు. ఫిలిప్ జాన్ దర్శకత్వంలో ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కనున్న ఈ ఇంగ్లీష్ ఫిలింలో.. సమంత ఒక డిటెక్టివ్ పాత్రలో నటిస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు. కానీ ఆ తర్వాత సినిమా మాత్రం సెట్స్ మీదకు వెళ్లలేదు. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఆ సినిమా నుంచి సమంత తప్పుకుందని సమాచారం.
దీంతో సమంత ప్లేస్‌లో శృతిహాసన్ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకి చెన్నై స్టోరీ అని టైటిల్ ఫిక్స్ చేశారు. శృతిహాసన్ లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో వివేక్ కాల్రా మరొక కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే.. సమంత ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో.. ఇకపై హీరోయిన్గా అసలు సినిమాలు చేయదా? అనే అనుమానాలు వస్తున్నాయి. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. కానీ నిర్మాతగా సినిమాలు చేయడానికి రెడీ అవుతోంది. హీరోయిన్గా మాత్రం నో చెబుతోంది. కాబట్టి.. ఇకపై సామ్‌ను హీరోయిన్గా చూడడం కష్టమే అంటున్నారు. మరి సమంత ఏం చేస్తుందో చూడాలి.