»Social Media Social Media Is Harmful To Mental Health
Social Media: సోషల్ మీడియా మానసిక ఆరోగ్యానికి హానికరం
ప్రస్తుతం చాలామంది సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ సోషల్ మీడియాని ఉపయోగిస్తున్నారు. అయితే ఇది మానసిక ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తుందని ఓ అధ్యయనం తెలిపింది.
Social Media: ప్రస్తుతం చాలామంది సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ సోషల్ మీడియాని ఉపయోగిస్తున్నారు. అయితే ఇది మానసిక ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తుందని తెలుసు. అయిన వీటి వాడకాన్ని మాత్రం తగ్గించరు. పొగాకు, గన్స్ ఎలా ఆరోగ్యానికి ప్రమాదకరం, పర్యావరణ విషమో సోషల్ మీడియా కూడా అంతే. టిక్‌టాక్, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, స్నాప్ చాట్ వంటి వాడకంతో పిల్లల్లో మానసిక రుగ్మతలు పెరిగిపోతున్నాయని ఓ అధ్యయనం తెలిపింది.
సోషల్ మీడియాను రోజులో ఎక్కువసేపు వినియోగిస్తుండటంతో పిల్లల్లో డిప్రెషన్ స్థాయిలు దశాబ్దంలోనే గరిష్ఠ స్థాయిని తాకినట్టు పలు అధ్యయనాల్లో తేలింది. వారాంతాల్లో 77 శాతం మంది హైస్కూల్ విద్యార్థులు హోంవర్క్‌ను వదిలేసి రోజులో మూడు లేదా అంతకంటే ఎక్కువ గంటలసేపు స్క్రీన్కు చూస్తున్నట్లు న్యూయార్క్ నగర డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ మెంటల్ హైజీన్ తేల్చింది.
సోషల్‌మీడియా వాడకంపై తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలకు పరిమితి విధించాలని ఆడమ్స్ మార్గదర్శకాల్లో సూచించారు. టీనేజర్లు ఆన్లైన్లో ఉన్నప్పుడు నోటిఫికేషన్లను ఆపేస్తూ.. మానసిక ప్రవర్తనను గమనిస్తూ ఉండాలన్నారు. టిక్‌టాక్, యూట్యూబ్ ఫేస్‌బుక్‌లాంటి సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలు పిల్లలను వ్యసనపరులుగా మార్చేలా ఫీచర్స్‌ను అందుబాటులోకి తెచ్చి, పిల్లల్లో మానసిక ఆరోగ్య సంక్షోభానికి ఆజ్యం పోస్తున్నాయని తెలిపారు. తమ నగర టీనేజర్లను వీటికి బానిసలుగా మారకుండా మార్గదర్శకాలు జారీ చేసినట్లు చెప్పారు.