»Ghmc Removed Illegal Structures At Jagans Residence In Hyderabad
Lotus Pond: హైదరాబాద్లో జగన్ నివాసం వద్ద అక్రమ నిర్మాణాలను తొలగించిన జీహెచ్ఎంసీ
హైదరాబాద్లోని లోటస్ పాండ్ వద్ద ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసంలో అక్రమ నిర్మించిన సెక్యూరిటీ పోస్టులను జీహెచ్ఎంసీ కూల్చివేసింది. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
GHMC removed illegal structures at Jagan's residence in Hyderabad
Lotus Pond: హైదరాబాద్ నగరంలో లోటస్ పాండ్ వద్ద ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం వద్ద కట్టిన అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులు వారికి నోటీసులు పంపిన తరువాతే తొలగించినట్లు తెలుస్తుంది. జగన్ ఇంటి వద్ద భద్రత సిబ్బంది కోసం నిర్మించిన సెక్యూరిటీ అవుట్ పోస్టు కట్టడాలు ఉన్నాయి. వీటిని ప్రభుత్వం అనుమతులు లేకుండా నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. ఫుట్ పాత్ రోడ్డును ఆక్రమించి ఈ నిర్మాణాలు చేపట్టారని, ఇవి ప్రజలకు అసౌకర్యకంగా మారాయని పలువురి ఫిర్యాదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదుల నేపథ్యంలో, జీహెచ్ఎంసీ అధికారులు స్పందించారు. దీనిపై తగిన ఆధారాలతో నోటీసులు ఇచ్చినట్లు, ఎవరు వాటిపై స్పందించక పోవడంతో ఆ నిర్మాణాలను జేసీబీల సాయంతో కూల్చివేశారు. జీహెచ్ఎంసీ చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఇకపై ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవని వారు భావిస్తున్నారు.