IAS officers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులు బదలీ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ఊఏఎస్ ఆఫీసర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. మొత్తం 20 మంది అధికారలను ఒకే సారి బదిలీలు చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
IAS officers: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ఊఏఎస్ ఆఫీసర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. మొత్తం 20 మంది అధికారలను ఒకే సారి బదిలీలు చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం కలెక్టర్గా ఉన్న మొజామిల్ ఖాన్ను బదిలీ చేసింది. ఈయనతో పాటు నాగర్ కర్నూలు కలెక్టర్ సంతోష్, రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, కరీంనగర్ కలెక్టర్ అనురాగ్ జయంతి, కామారెడ్డి కలెక్టర్గా ఉన్న ఆశిష్ సాంగ్వాన్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్గా జితేష్ వి పాటిల్, జయశంకర్ భూపాల్ పల్లి కలెక్టర్ రాహుల్ శర్మ, నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్, పెద్దపల్లి కలెక్టర్గా ఉన్న కోయ శ్రీహర్ష, హన్మకొండ కలెక్టర్గా ఉన్న ప్రావీణ్యలను బదిలీ చేసింది.
వీరితో పాటు జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్, మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేంద్ర బోయి, మంచిర్యాల కలెక్టర్గా ఉన్న కుమార్ దీపక్, వికారాబాద్ కలెక్టర్గా ఉన్న ప్రతిక్ జైన్, నల్గొండ కలెక్టర్ నారాయణ రెడ్డి, వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి, సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి, ములుగు కలెక్టర్గా టీఎస్ దివాకరా చివరగా నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్లను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటి సారి పెద్ద మొత్తంలో కలెక్టర్లను బదిలీలు చేశారు.