Kidney Stones : హైదరాబాద్ లోని ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU)లోని వైద్యులు అరుదైన ఘనత సాధించారు. ఓ రోగి కిడ్నీలో ఉన్న రాళ్లను తొలగించి అతడికి జీవం పోశారు. నిపుణులైన యూరాలజిస్ట్ల బృందం కేవలం 27 శాతం మూత్రపిండాల పనితీరు ఉన్న రోగి కిడ్నీ నుండి 418 రాళ్లను విజయవంతంగా తొలగించారు. కిడ్నీలో రాళ్లను తొలగించే అధునాతన శస్త్రచికిత్సా పద్ధతుల్లో ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఇన్వాసివ్ విధానం ద్వారా ఈ అద్భుతమైన ఫీట్ సాధించామని వైద్యులు బుధవారం తెలిపారు.
ఒక 60 ఏళ్ల వ్యక్తికి చాలా ఎక్కువ సంఖ్యలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడ్డాయి. దీంతో మూత్రపిండాల పనితీరు తీవ్రంగా బలహీనపడిపోయింది. తరచూ నొప్పి రావడంతో సదరు రోగి ఎర్రమంజిల్లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ, యూరాలజీ (ఏఐఎన్యూ) వైద్యులను సంప్రదించారు. వారు ఈ కేసును ఓ సవాల్ గా తీసుకున్నారు. డాక్టర్ కె. పూర్ణ చంద్ర రెడ్డి, డాక్టర్ గోపాల్, డాక్టర్. దినేష్ ఎం నేతృత్వంలోని బృందం పెర్క్యుటేనియస్ నెఫ్రోలిథోటమీ (PCNL)ని ఉపయోగించాలని ఎంచుకుంది. ఇది అతి తక్కువ హానికరమైన పద్ధతి. ఈ పద్ధతిలో కిడ్నీలో ఏర్పడిన 418 రాళ్లను తొలగించారు. ప్రస్తుతం రోగి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
#Hyderabad – Hyd Hospital removed 418 kidney stones from a patient with only 27% kidney function. It was accomplished through a minimally invasive procedure.
The 60-year-old patient presented a unique challenge with an unprecedented number of kidney stones and severely impaired… pic.twitter.com/Bfkf7r8nU1